Bheemla Nayak Song Update: మరొక పాటతో అలరించనున్న "భీమ్లా నాయక్"

Bheemla Nayak Song Adavi Thalli Mata Song to be Release on December 4
x

Bheemla Nayak Song Update: మరొక పాటతో అలరించనున్న "భీమ్లా నాయక్"

Highlights

Bheemla Nayak Song Update: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

Bheemla Nayak Song Update: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్టయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిత్యమీనన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కాబోతోంది.

అయితే సినిమా తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లను మొదలు పెట్టింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఒక పాటని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా నుంచి "అడవి తల్లి మాత" అనే పాట రేపు అనగా డిసెంబర్ 4న ఉదయం 10:08 నిమిషాలకి విడుదల కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories