హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Bheemla Nayak Pre Release Event: ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్

Rama Rao
Published on: 24 Feb 2022 7:27 AM IST
Bheemla Nayak Pre Release Event in Hyderabad | Telugu Online News
X

హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Bheemla Nayak Pre Release Event: చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఇమడవన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కళాకారులు ఉండే చోటు ఇది నిజమైన కళాకారులకు కులమతాలు ఉండవన్నారు పవర్. చెన్నైలో ఉండే చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కి తీసుకుని రావడానికి పెద్దలు చాలా కష్టపడ్డారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు.

ఒక మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదని, పవన్‌కు సోదరుడిలా వచ్చానన్నారు మంత్రి కేటీఆర్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 8 ఏళ్లుగా భారత చిత్ర పరిశ్రమకు కేంద్రబిందువుగా హైదరాబాద్‌ ఉందన్నారు. గోదావరి జిల్లాల్లో షూటింగ్‌లు జరుపుకొన్నట్లే తెలంగాణలోనూ చిత్రీకరణలు జరపాలని కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story