Bheemla Nayak: బ్రేక్ ఈవెన్ పాయింట్ వైపు పరుగులు పెడుతున్న "భీమ్లా నాయక్" కలెక్షన్లు

Bheemla Nayak Movie to Reach Break Even Point Soon | Tollywood News
x

బ్రేక్ ఈవెన్ పాయింట్ వైపు పరుగులు పెడుతున్న "భీమ్లా నాయక్" కలెక్షన్లు 

Highlights

Bheemla Nayak: బ్రేక్ ఈవెన్ పాయింట్ వైపు పరుగులు పెడుతున్న "భీమ్లా నాయక్" కలెక్షన్లు

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి వారాంతంలోనే దాదాపు 60 శాతం రికవరీ చేసిన సినిమా అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా రీచ్ అవ్వనుంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ 107 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మంగళవారం కూడా సెలవు పండుగ సెలవు కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చిత్ర మూడు రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 23 కోట్లు

సీడెడ్: 7.2 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 4.5 కోట్లు

గుంటూరు: 3.87 కోట్లు

ఈస్ట్ గోదావరి: 3.55 కోట్లు

వెస్ట్ గోదావరి: 3.91 కోట్లు

కృష్ణ: 2.31 కోట్లు

నెల్లూరు: 1.78 కోట్లు

ఏపీ+తెలంగాణ: 50.12 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 6.25 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ 9.85 కోట్లు

వరల్డ్ వైడ్: 66.22 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories