Bheemla Nayak Movie: రికార్డులు సృష్టిస్తున్న "భీమ్లా నాయక్"

Bheemla Nayak Movie Record Collection | Tollywood News
x

 రికార్డులు సృష్టిస్తున్న "భీమ్లా నాయక్" 

Highlights

Bheemla Nayak Movie: పుష్ప రికార్డు బ్రేక్ చేసిన "భీమ్లా నాయక్"

Bheemla Nayak Movie: భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా థియేటర్లలో నిన్న అనగా ఫిబ్రవరి 25, 2022 న విడుదలైంది. మొదటి షో నుంచి ప్రేక్షకుల నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ సినిమా ఒరిజినల్ కంటే చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ సినిమాకి వెన్నెముకగా మారిందని అందులోనూ థమన్ అందించిన సంగీతం మరియు పవన్ కళ్యాణ్, రానా ల నటన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా మార్చిందని చెప్పుకోవచ్చు.

మొదటిరోజు నైజాంలో 11.85 కోట్ల షేర్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది "భీమ్లా నాయక్". గతంలో 11.44 కోట్ల తో "పుష్ప" సినిమా రికార్డు సృష్టించగా, ఈ రికార్డుని బ్రేక్ చేసింది "భీమ్లా నాయక్". ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ఇప్పుడు పుష్ప రెండవ స్థానంలో నిలవగా మూడవ స్థానంలో సాహోసినిమా 9.41 కోట్లతో నిలిచింది. బాహుబలి 2 చిత్రం 8.9 కోట్లు వసూలు చేయగా, వకీల్ సాబ్ 8.75 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్లు కూడా కొంచెం నెమ్మదించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories