Bheemla Nayak: 100 కోట్లకు చేరిన "భీమ్లా నాయక్" కలెక్షన్లు

Bheemla Nayak: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Arun Chilukuri
Published on: 7 March 2022 8:06 PM IST
Bheemla Nayak Hits 100Cr Shares
X

Bheemla Nayak: 100 కోట్లకు చేరిన "భీమ్లా నాయక్" కలెక్షన్లు

Bheemla Nayak: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా రానా కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు.

నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తాజాగా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ ని సంపాదించుకున్న "భీమ్లా నాయక్" సినిమా కలెక్షన్లు తాజాగా వంద కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా షేర్ 100 కోట్లు దాటిందని చిత్ర దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. "వకీల్ సాబ్" తర్వాత పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో బ్లాక్బస్టర్ అంటూ అభిమానులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story