Bheemla Nayak - Rana Teaser: రానా టీజర్ కు తేదీ ఖరారు

* డానియల్ శేఖర్ పాత్రలో అదరగొట్టనున్న రానా

admin1
Updated on: 14 Sept 2021 12:30 PM IST
Bheemla Nayak Director Ready to Show Rana Power in New Teaser on 17th September 2021
X

 డానియల్ శేఖర్ పాత్రలో అదరగొట్టనున్న రానా 

Bheemla Nayak - Rana Teaser: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "భీమ్లా నాయక్". మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా మరొక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మరియు టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఇప్పటిదాకా విడుదలైన టీజర్ లో కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రమే హైలైట్ అవడంతో రానా అభిమానులు ప్రత్యేకంగా రానాతో ఒక టీజర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సినిమా లో రానా పాత్ర డానియల్ శేఖర్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన టీజర్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. పవర్ ఫుల్ గా ఉండే ఈ టీజర్ సెప్టెంబర్ 17 న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక మరొక రెండు రోజుల్లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు దర్శకనిర్మాతలు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో సముతిర ఖని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story