యూట్యూబ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసిన చరణ్!

యూట్యూబ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసిన చరణ్!
x
Highlights

Bheem For Ramaraju : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

Bheem For Ramaraju : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.

ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి నెలలో రిలీజ్ చేసిన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' యూట్యుబ్ లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ వాయిస్ తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్ కి వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది చూశారు. దీనితో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా 'భీమ్‌ ఫర్‌ రామరాజు' రికార్డు సృష్టించింది. అటు కొమరం భీమ్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories