'భారతీయుడు 2' షూటింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్న నిర్మాతలు

భారతీయుడు 2 షూటింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్న నిర్మాతలు
x
Highlights

స్టార్ దర్శకుడు శంకర్ అంటేనే భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ మధ్యనే '2.0' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం...

స్టార్ దర్శకుడు శంకర్ అంటేనే భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ మధ్యనే '2.0' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా 'భారతీయుడు' కి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా 'భారతీయుడు 2' షూటింగ్ విషయంలో వారు అసంతృప్తిగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందువలన కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అలాంటిదేమీ లేదు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైనట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కు రెండున్నర కోట్లు బడ్జెట్ అంచనా వేసుకో గా షెడ్యూల్ పూర్తయ్యే సరికి 6 కోట్లు ఖర్చయింది. పైగా అంత ఖర్చు పెట్టినప్పటికీ అన్ని సీన్లను చిత్రీకరించలేక పోయారట. పైగా కమల్ హాసన్ మేకప్ చేసేందుకు సమయం పడుతోందని దీంతో షూటింగ్ ఆలస్యమవుతోందని, కమల్ హాసన్ తన రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారట. వీటన్నిటితో తలమునకలై ఉన్న లైకా వారు ఇంతటితో సినిమాను ఆపేస్తే మంచిది అనే ఆలోచనను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories