"ఆర్ఆర్ఆర్" ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు... తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్..!

"ఆర్ఆర్ఆర్" ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు... తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్..!

Arun Chilukuri
Published on: 8 March 2023 4:33 PM IST
Bharadwaja Thammareddy Shocking Comments Over RRR Team Expenses
X

"ఆర్ఆర్ఆర్" ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు... తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్..!

Bharadwaja Thammareddy: "బాహుబలి" సినిమా తోనే యావత్ ప్రపంచం ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల వైపు తిరిగి చూసేలా చేసిన ఎస్ఎస్ రాజమౌళి "అర్ఆర్ఆర్" సినిమాతో మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ ఫిలిం మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ్ కొన్ని షాపింగ్ కామెంట్లు చేశారు.

చిత్ర బృందం ఫ్లైట్ టికెట్లకు పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చు అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా గురించి రియాక్ట్ అయ్యారు. "ఆర్ఆర్ఆర్ సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 80 కోట్లతో 8 లేదా 10 సినిమాలు చేయొచ్చు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకే 80 కోట్ల దాకా వాడుతున్నారు," అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.

అంతేకాకుండా సినిమాల గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకు ఏదో నేర్పించాలనో వాళ్ళని మార్చాలని కాదు మనకి నచ్చినట్లు మనం సినిమా తీయాలి అని అన్న తమ్మారెడ్డి భరద్వాజ్ "అర్ఆర్ఆర్" వంటి సినిమాలను తాము చేయమని కేవలం చూస్తామని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక తమ్మారెడ్డి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు అభిమానులు పాజిటివ్‌గా తీసుకోగా మరికొందరు మాత్రం నెగిటివ్‌గా తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story