"సార్" సినిమాలో ధనుష్ లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

* ధనుష్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్

Dhatripriya
Published on: 28 Feb 2023 1:28 PM IST
Bharadwaja Thammareddy Comments On Dhanush Looks
X

"సార్" సినిమాలో ధనుష్ లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

Dhanush: తమిళ్లో స్టార్ హీరో అయిన ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ధనుష్ తాజాగా ఈ మధ్యనే తన కెరీర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "సార్" తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "తొలిప్రేమ", "మిస్టర్ మజ్ను" ఫేమ్ డైరెక్టర్ వెంకి అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ధనుష్ ఒక జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించారు.

పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా కథ ప్రభుత్వ కళాశాలలు మరియు విద్యా వ్యవస్థ ఆధారంగా తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి చెప్పుకొచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ సినిమాలో ధనుష్ గురించి కూడా ఫన్నీ కామెంట్లు చేశారు. సినిమాలో ధనుష్ ను చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కనిపించారు అని అన్నారు.

మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదలైన "సార్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికి కూడా థియేటర్లలో సినిమా సందడి చేస్తూనే ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇలవరసు, రాజేంద్రన్, హరీష్ పేరాడి, ప్రవీణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story