బెల్లంకొండ సినిమాతో పరిచయం కాబోతున్న హీరోయిన్ కూతురు

* ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ అవంతిక దాసాని ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

admin1
Published on: 14 Nov 2021 3:53 PM IST
Bhagyashree Daughter Avantika Dasani will Act with Bellamkonda Ganesh in Satish Vegesna Direction
X

అవంతిక దాసాని - బెల్లంకొండ గణేష్ (ఫైల్ ఫోటో)

Avantika Dasani - Bellamkonda Ganesh: టాలీవుడ్ నిర్మాతలలో మంచి పేరున్న బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే తెలుగులో హీరోగా మారిన సంగతి తెలిసిందే. "రాక్షసుడు" సినిమాతో హిట్ కూడా అందుకున్న బెల్లంకొండ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు.

ఇక తాజాగా బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా టాలీవుడ్ లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నిజానికి బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ ఆ సినిమా వాయిదా పడింది.

తాజాగా ఇప్పుడు బెల్లంకొండ గణేష్ "శతమానంభవతి" ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఒక సినిమా లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ అవంతిక దాసాని ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈమె ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు. చాలా కాలం పాటు కెమెరా కి దూరంగా ఉన్న భాగ్యశ్రీ ఇప్పుడు మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు భాగ్యశ్రీ కుమార్తె అవంతిక హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

admin1

admin1

Next Story