Kamna Jethmalani: బెండు అప్పారావు హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా.? షాక్‌ అవ్వాల్సిందే..

Kamna Jethmalani: సినిమా ఇండస్ట్రీలో హీరోల హవా ఉన్నన్ని రోజులు హీరోయిన్ల హవా సాగదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2024 12:34 PM IST
Bendu Apparao RMP Actress Kamna Jethmalani Latest Photos Goes Viral
X

Kamna Jethmalani: బెండు అప్పారావు హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా.? షాక్‌ అవ్వాల్సిందే..

Kamna Jethmalani: సినిమా ఇండస్ట్రీలో హీరోల హవా ఉన్నన్ని రోజులు హీరోయిన్ల హవా సాగదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు కాదన్నా ఇది బహిరంగ రహస్యమే. వరుస విజయాలను అందుకున్న హీరోయిన్లు కూడా కొద్ది కాలానికే తెరమరుగైన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్‌లో కామ్నా జెఠ్మలానీ ఒకరు. తెలుగులో మంచి సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకుందీ బ్యూటీ.

ప్రేమికులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సామాన్యుడు, రణం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అల్లరి నరేష్‌ హీరోగా వచ్చిన బెండప్పరావు ఆర్‌ఎంపీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో తన క్యూట్ నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో మళ్లీ చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయింది. కత్తికాంతారావు తర్వాత మళ్లీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో సైడ్‌ క్యారెక్టర్‌లో కూడా నటించింది. ఇక 2014లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కామ్నా సినిమాలకు పూర్తిగా దూరమైంది.

అయితే సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా మాత్రం నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటోంది. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌ చేసిన ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story