వాయిదాపడిన బెల్లంకొండ సినిమా

వాయిదాపడిన బెల్లంకొండ సినిమా
x
Highlights

హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి పరిచయం అయి చాలా కాలమైంది కానీ కనీసం ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఈ మధ్యనే 'కవచం' అనే సినిమాతో మరొక...

హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి పరిచయం అయి చాలా కాలమైంది కానీ కనీసం ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఈ మధ్యనే 'కవచం' అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న బెల్లంకొండ హీరో మళ్లీ అదే సినిమాలో హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్తో కలిసి 'సీత' అనే సినిమాలో నటించాడు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కావలసి ఉంది కానీ కానీ ఇప్పుడు ఈ చిత్ర విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ ఈ సినిమా విడుదలను మే 24కి వాయిదా పడింది. మే 9న 'మహర్షి' సినిమా విడుదల కానుంది. మరొకవైపు మే 31 న 'డియర్ కామ్రేడ్' కూడా బరిలోకి దిగనుంది. అందుకే ఈ మధ్యలోనే సినిమాను విడుదల చేయాలని మే 24న 'సీత' ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఈ లోపు ఈ సినిమా నుండి కొన్ని పాటలు మరియు ట్రైలర్ విడుదల చేసి ఈ సినిమాపై బజ్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మరి ఈ సినిమాతోనైనా బెల్లంకొండ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories