Bellamkonda Suresh: చీటింగ్ కేసుపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్

Bellamkonda Suresh: ఆధారాలు ఇవ్వనందుకు నాపై కేసు పెట్టిన వ్యక్తికి నోటీస్‌ ఇచ్చారు‌- బెల్లంకొండ

Shireesha
Updated on: 12 March 2022 1:58 PM IST
Bellamkonda Suresh Reaction on Cheating Case | Bellamkonda Srinivas
X

Bellamkonda Suresh: చీటింగ్ కేసుపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్

Bellamkonda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసుపై బెల్లంకొండ సురేష్ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఆధారాలు ఇవ్వనందుకు తనపై కేసు పెట్టిన వ్యక్తికే నోటీస్‌ ఇచ్చారని తెలిపారు. శరణ్ అనే వ్యక్తి 85 లక్షలు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

శరణ్‌ను ప్రొత్సహించి ఎవరు ఇలా చేయిస్తున్నారో తెలుసన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొంటానన్నారు. నాలుగేళ్ల క్రితం డబ్బులిస్తే ఏం చేశారని, ఆధారాలు ఉంటే ఇవ్వచ్చు కదా అని బెల్లంకొండ సురేష్ ప్రశ్నించారు.

Shireesha

Shireesha

Next Story