Bellamkonda Srinivas:'కర్ణన్' రీమేక్ లో బెల్లంకొండ శ్రీను!

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 31 May 2021 10:00 PM IST
Bellamkonda Srinivas in Karnan Remake
X

బెల్లంకొండ శ్రీను (ఫొటో ట్విట్టర్)

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ లో కెరీర్ ప్రారంభంలో మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు సంపాధించాడు. అయితే ఈ మధ్య వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. అయినా పట్టుదలతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల 'అల్లుడు అదుర్స్ ' లో బోల్తాపడ్డాడు. అయితే, ఈ సినిమాను హిందీలో చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపించింది. తెలుగు రిజల్ట్ చూసి, వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. కాగా, తెలుగులో ప్రభాస్ చేసిన 'ఛత్రపతి' సినిమాను, వినాయక్ డైరెక్షన్‌లో హిందీలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ, ఇదీ కూడా ఎందుకో మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అయితే, తమిళంలో ధనుశ్ చేసిన 'కర్ణన్'ను తెలుగులో రీమేక్ చేయాలనుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా 'ఛత్రపతి' రీమేక్ ను కొంతకాలం పాటు వాయిదా వేశాడని తెలుస్తోంది. ముందుగా 'కర్ణన్' రీమేక్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళంలో 'కర్ణన్' భారీ వసూళ్లను రాబట్టి, విజయం సాధించింది. తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ దక్కించుకున్నాడు. ఈమేరకు బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా .. నిర్మాతగా ఎలాంటి రిజల్ట్‌ చూస్తాడో మరి.

Venkata Chari

Venkata Chari

Next Story