Bellamkonda Sreenivas: రీమేక్‌లపై దృష్టి పెట్టిన బెల్లంకొండ

Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Venkata Chari
Updated on: 29 April 2021 6:23 PM IST
Bellamkonda Sreenivas Star Telugu Remake Karnan
X

బెల్లకొండ శ్రీనివాస్ (ఫొటో ట్విట్టర్)

Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు బెల్లకొండ. ఇప్పటిదాకా పెద్ద హిట్ కొట్టలేదు. దీంతో రీమేక్ పై ఆశలు పెట్టుకున్నాడు.

తమిళ రీమేక్‌ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న మరో రీమేక్‌ ఛత్రపతి. ఈ మూవీ రీమేక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీకీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించేందుకు అనన్య పాండే సిద్ధమైంది.

మరోవైపు బెల్లంకొండ ఇప్పుడు మరో రీమేక్‌ సినిమాతో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ధనుష్‌ హీరోగా తమిళంలో 'కర్ణన్' రిలీజైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ సాధించింది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే బెల్లంకొండ ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కర్ణన్‌ మూవీని రీమేక్‌ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story