Bellamkonda Ganesh : వెండితెరపైకి మరో నట వారసుడు!

Bellamkonda Ganesh : వెండితెరపైకి మరో నట వారసుడు!
x

Bellamkonda Ganesh

Highlights

Bellamkonda Ganesh : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికి హీరోగా ఎంట్రీ

Bellamkonda Ganesh : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికి హీరోగా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు.. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. ఇక ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రంగం సిద్ధం అయిపోయింది. 'ప్రేమ ఇష్క్‌ కాదల్', 'సావిత్రి' చిత్రాల దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వంలో గణేష్ బాబు హీరోగా సినిమా రూపొందుతోంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ కాలేదు.. దాదాపుగా 50 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.. కరోనా వలన సినిమా షూటింగ్ వాయిదా పడింది..

అయితే ఈరోజు ( సెప్టెంబర్ 14)న గణేష్ పుట్టినరోజు కావడంతో చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైనా లక్కీ మీడియా ట్వీట్ చేసింది. ''యంగ్ హీరో, డైనమిక్ ప్రొడ్యూసర్ గణేష్ బెల్లంకొండకి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొంది. గణేష్ హీరోగా కంటే ముందు నిర్మాతగా సినిమాలను నిర్మించారు. ఇక ఈ సినిమాని బీటెల్‌ లీఫ్ ప్రొడక్షన్స్‌, లక్కీ మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తం నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్‌ ఆత్రేయ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories