Vivah Remake:'వివాహ్' రీమేక్ లో హీరో హీరోయిన్లు ఎవరంటే..?

Vivah Remake: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ టాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు.

Venkata Chari
Updated on: 17 May 2021 3:25 PM IST
Bellamkonda Ganesh and Krithi Shetty in Vivah Movie Telugu Remake
X

బెల్లంకొండ గణేష్, కృతి శెట్టి (ఫొటో ట్విట్టర్)

Vivah Remake: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ టాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకంటున్న సంగతి తెలిసిందే.

గణేష్ హీరోగా ప్రారంభమైన మొదటి సినిమా ఏవో కారణాలతో ఆగిపోయిందనే వార్తలు బాగా ప్రచారమయ్యాయి. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం.. తన రెండో కుమారిపై అరంగేట్రంపై చాలా పట్టుదలగా ఉన్నాడంట. ఈ మేరకు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన `వివాహ్` రీమేక్ హక్కులను కొనుగోలు చేశారంట. దీనిని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారంట. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, డైరెక్టర్‌ ను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే డైరెక్టర్‌ను ఎంపిక చేసి, ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారంట.

కాగా, షాహిద్ కపూర్, అమృత రావు హీరోహీరోయన్లుగా నటించిన వివాహ్ సినిమా 2006 లో రిలీజైంది. సూరజ్ బర్జాత్య ఈ సినిమాకు డైరెక్టర్‌గా పనిచేశారు.

Venkata Chari

Venkata Chari

Next Story