Krithi Shetty: తెలంగాణ అమ్మాయి గా బేబమ్మ

Krithi Shetty: ఉప్పెన చిత్రం భారీ సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ పొందింది హీరోయిన్ కృతి శెట్టి.

Venkata Chari
Published on: 3 March 2021 7:12 PM IST
Bebamma As Telangana Girl in Her Next Movie
X

కృతి శెట్టి (ఫోటో హన్స్ ఇండియా)

Krithi Shetty: ఉప్పెన విజయంతో జోరు పెంచింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి చిత్రం భారీ సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ పొందింది బేబమ్మ. ఈ చిత్రంలో పోషించిన పాత్రకు అద్భుతమైన స్పందన రావడంతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

తన రాబోయే తెలుగు సినిమాలో మన పక్కింటి అమ్మాయి పాత్రలో మెరవనుందని సమాచారం. ఆ చిత్రంలో తన పాత్ర కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకుంటున్నట్లు తెలస్తోంది. తెలంగాణ అమ్మాయి పాత్రలో కృతి శెట్టిని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

కాగా, హృతిక్ రోషన్ యొక్క సూపర్ 30 లో చిన్న పాత్ర పోషించిన కృతి శెట్టి.. నాచురల్ స్టార్ నాని సినిమా శ్యామ్ సింగ రాయ్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story