పూజా హెగ్డే కి షాక్ ఇచ్చిన "బీస్ట్" నిర్మాతలు.. ఆ బిల్లులు కట్టమని..

* పూజా హెగ్డే బిల్లు ఆమె కట్టుకోవాలి అంటున్న నిర్మాతలు

Rama Rao
Updated on: 21 Jun 2022 5:15 PM IST
Beast Movie Producers Who Shocked Pooja Hegde | Kollywood News
X

పూజా హెగ్డే బిల్లు ఆమె కట్టుకోవాలి అంటున్న నిర్మాతలు

Beast Movie Producers: నాగ చైతన్య హీరోగా నటించిన "ఒక లైలా కోసం" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజ హెగ్డే చాలా కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లు అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక హిందీ లో కూడా ఈమె హవా బాగానే నడుస్తుంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్డేపై గత కొంత కాలంగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

ఇది వరకు పూజ షూటింగ్ లొకేషన్ కి ఒకరు లేదా ఇద్దరిని తోడుగా వెంట తీసుకొచ్చేదట. కానీ ఇప్పుడు ఈమె ఇప్పుడు ఏకంగా డజన్ మందిని వెంటబెట్టుకొని షూటింగ్ లొకేషన్ కి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్ చేస్తూ తనతో పాటు తన స్టాఫ్ కి అయ్యే ఖర్చులను కూడా నిర్మాణ సంస్థ భరించాలని అగ్రిమెంట్ కుదుర్చుకుంటుందట. ఈ విషయంపై తమిళ్ దర్శకుడు ఆర్కే సెల్వమణి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా సరే పూజ మాత్రం తన పద్ధతిని మార్చుకోకపోవడంతో తాజాగా ఒక నిర్మాణ సంస్థ ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందట. కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన "బీస్ట్" సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు ఈ సినిమాతో తీవ్ర నష్టాలైతే మిగిలాయి. అసలే నష్టాల్లో ఉన్న నిర్మాతలకు పూజ హెగ్డే మరియు ఆమె స్టాఫ్ ఖర్చులు ఇంకా భారంగా మారాయట. దాంతో నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులు తానే కట్టుకోవాలి అంటూ బిల్లు పేపర్లను పంపి షాక్ ఇచ్చారట.

Rama Rao

Rama Rao

Next Story