"ఆర్ఆర్ఆర్" బృందాన్ని ఫాలో అవుతున్న బీస్ట్ దర్శక నిర్మాతలు

Beast Movie Director and Producers Following the RRR Movie Team
x

"ఆర్ఆర్ఆర్" బృందాన్ని ఫాలో అవుతున్న బీస్ట్ దర్శక నిర్మాతలు

Highlights

"ఆర్ఆర్ఆర్" బృందాన్ని ఫాలో అవుతున్న బీస్ట్ దర్శక నిర్మాతలు

Beast Movie: టాలీవుడ్ హీరో విజయ్ హీరోగా నటించిన "బీస్ట్" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు "ఆర్ ఆర్ ఆర్" స్ట్రాటజీని వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు మాస్టర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు విజయ్. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇక "బీస్ట్" సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు విజయ్.

"బీస్ట్" సినిమాని కేవలం తమిళ్ లో మాత్రమే కాక మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుతూ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక "ఆర్ ఆర్ ఆర్" సినిమా మార్చ్ 25న విడుదల కాబోతోంది కానీ మార్చి 24న చిత్రబృందం ప్రీమియర్స్ ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే "బీస్ట్" దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల అవుతున్నప్పటికీ ఒకరోజు ముందే చిత్ర ప్రీమియర్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories