మిక్స్‌డ్‌ టాక్‌లో కూడా దుమ్మురేపుతున్న బీస్ట్.. బాక్సాఫీస్ వద్ద రచ్చ..

Beast Movie Box Office Collection Day 1
x

మిక్స్‌డ్‌ టాక్‌లో కూడా దుమ్మురేపుతున్న బీస్ట్.. బాక్సాఫీస్ వద్ద రచ్చ..

Highlights

Beast Box Office Day 1: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Beast Box Office Day 1: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్ ను అందుకుంటోంది. మొత్తానికి బీస్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది.

మొదటి రోజే ఈ మూవీ నైజాంలో రూ. 3.05 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. అలాగే సీడెడ్‏లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.40 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో 'బీస్ట్' 40-50% ఆక్యుపెన్సీతో తొలిరోజు రూ. 5-7 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమా తొలిరోజే.. రూ. 7.5 కోట్లు వసూలు చేసినట్లుగా సమచారం. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజే.. రూ. 30 నుంచి 35 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ. 50కోట్ల మార్క్ దాటేసిందని టాక్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్.. వద్ద మొదటి రోజే.. రూ. 65 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories