BB3 Movie: బాలయ్య 'బీబీ3' మేలో రిలీజ్ అయ్యేనా?

BB3 Movie Release in May 2021 Becomes Doubtful
x

బాలయ్య బాబు (ఫొటో: ది హన్స్ ఇండియా)

Highlights

BB3 Movie: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో లో మూడో సినిమా 'బీబీ3' ను మిరియాలా రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

BB3 Movie: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బీబీ3 గా పిలిచే ఈ సినిమాను మిరియాలా రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. లెజెండ్, సింహా తో ఈ కాంబో బ్లాక్ బస్టర్లను అందించడంతో... బీబీ3 పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

అయితే, ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, బీబీ3 ఇంకా ఆలస్యం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాను కేవలం 40 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇంకా చిత్రీకరణ చేయాల్సింది చాలా ఉందని టాక్. ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టినా... మే 28లోపు సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమని అంటున్నారు విశ్లేషకులు.

ఈ సినిమా ప్రారంభించి నాటి నుంచి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ ఆగిపోతూనే ఉంది. అయితే, ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అయితే, ఈ సినిమా పూర్తి కావడానికి చాలాం టైం పడుతుందని, అనుకున్న సమయానికి థియేటర్లోకి రాకపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories