Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట..!

Kisi Ka Bhai Kisi Ki Jaan: తెలంగాణ పండక్కి బాలీవుడ్ సినిమాలో చోటు దక్కింది.

Arun Chilukuri
Updated on: 31 March 2023 2:01 PM IST
Bathukamma Song Out From Kisi Ka Bhai Kisi Ki Jaan Movie
X

Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట

Kisi Ka Bhai Kisi Ki Jaan: తెలంగాణ పండక్కి బాలీవుడ్ సినిమాలో చోటు దక్కింది. మన సంస్కృతిలో భాగమైన సంబరాన్ని సల్మాన్ ఖాన్ వెండితెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ఖాన్‌ స్వయంగా నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌'. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. పూజాకి అన్నయ్యగా ఆయన కనిపిస్తారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ సినిమాలో బతుకమ్మ విశిష్టతను తెలిపేలా సాంగ్ రూపొందించారు.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను తెగు ఆకట్టుకుంటుంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మాన్‌ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story