Bangaru Bullodu: 'బంగారు బుల్లోడు' తొలి రోజు కలెక్షన్స్

Bangaru Bullodu: బంగారు బుల్లోడు తొలి రోజు కలెక్షన్స్
x

బంగారు బుల్లోడు

Highlights

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'బంగారు బుల్లోడు'.

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'బంగారు బుల్లోడు'. గతంలో ఏడాదిలోనే ఏడు సినిమాలు పైగా విడుదల చేసి అల్లరి నరేష్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నరేశ్ కొన్ని ఏళ్ళుగా కథల ఎంపికపై దృష్టి పెట్టి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 'బంగారు బుల్లోడు' మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసి టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 450కి పైగా థియేటర్స్‌లో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. థ్రిలింగ్ కామెడీగా జనవరి 23వ తేదీన విడుదలైన 'బంగారు బుల్లోడు' మూవీపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదని లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అర్థమవుతోంది. సంక్రాంతి హాలిడేస్ కూడా ముగియడం ఈ కలెక్షన్స్‌పై అంచనాలకు అందలేదు.

'బంగారు బుల్లోడు' రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపికేవలం 67 లక్షలు మాత్రమే రాబట్టాడు. అల్లరి నరేష్ ఫామ్ ప్రకారం చూస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లే. బిజినెస్ పరంగా కలెక్షన్స్ పెరగాలి. 3.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన 'బంగారు బుల్లోడు' మొదటి రోజు మొత్తం మీద 70 లక్షల షేర్ రికవరీ చేశాడు. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 2.8 కోట్ల రేంజ్ షేర్ రావాలి.

ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే..

నైజాం: 21L,సీడెడ్: 13L,ఉత్తరాంధ్ర: 11L, ఈస్ట్ గోదావరి: 6.1L,వెస్ట్ గోదావరి: 4.2L,గుంటూరు: 4.6L, కృష్ణా: 4L,నెల్లూరు: 3.3L,AP/TG టోటల్: 67 లక్షలు

KA+ROI: 2 లక్షలు,ఓవర్‌సీస్: 1 లక్ష ,WW Total: 70 లక్షలు, గ్రాస్ 1.15Cr

Show Full Article
Print Article
Next Story
More Stories