Bangarraju Teaser: అదిరిపోయే లుక్ తో చిన్న"బంగార్రాజు" వచ్చేశాడు

* నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా "బంగార్రాజు" మూవీ టీజర్ విడుదల

Sandeep Reddy
Updated on: 23 Nov 2021 12:28 PM IST
Nagarjuna Released Bangarraju Movie Teaser Today as Naga Chaitanya Birthday 23 11 2021
X

Bangarraju Teaser: అదిరిపోయే లుక్ తో చిన్న"బంగార్రాజు" వచ్చేశాడు

Bangarraju Movie Teaser: నాగార్జున "సోగ్గాడే చిన్నినాయనా" సూపర్ హిట్ చిత్రం తరువాత "సోగ్గాడు మళ్ళీ వచ్చాడు" ట్యాగ్ లైన్ తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "బంగార్రాజు". అక్కినేని నాగార్జునతో పాటు ఈ సినిమా నాగ్ తనయుడు నాగ చైతన్య కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి హీరో నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 22న విడుదల చేశారు.

తాజాగా నవంబర్ 23న నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా "బంగార్రాజు" సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. చిన్న బంగార్రాజు పాత్రలో నాగ చైతన్య తన స్టైలిష్ లుక్ తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. "బంగార్రాజు"లో చిత్రంలో నాగచైతన్య జోడిగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా, "సోగ్గాడే చిన్నినాయనా" సినిమా తరువాత కింగ్ నాగార్జునతో రమ్యకృష్ణ మరోసారి జోడిగా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా "బంగార్రాజు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story