Bangarraju Movie: సంక్రాంతి బరిలో దిగనున్న బంగార్రాజు

*రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు *ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు

admin1
Updated on: 20 Oct 2021 9:00 PM IST
Bangarraju Movie is Set to Release in Theatres Next Year During Sankrathi Festival
X

బంగార్రాజు సినిమా (ఫైల్ ఫోటో)

Bangarraju Movie: ఇప్పటికే 2016లో నాగార్జున కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో "సోగ్గాడే చిన్నినాయన" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్గా "బంగార్రాజు" అనే సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు నాగార్జున.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదల కాబోతోంది. నిజానికి సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు "బంగార్రాజు" విషయంలో కూడా సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.

కానీ మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి బోలెడు స్టార్ హీరోల సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్", మహేష్ బాబు "సర్కారు వారి పాట", ప్రభాస్ "రాధే శ్యామ్" మరియు రాజమౌళి "ఆర్ఆర్ఆర్" కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా బంగార్రాజు సినిమాపై కూడా మంచి అంచనాలు ఉండటంతో ఎంత కాంపిటేషన్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా బాగానే ఆడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు.

admin1

admin1

Next Story