నీ కొడుకు కోసం నీకు సమయం లేదా? పూరీపై బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bandla Ganesh Sensational Comments on Puri Jagannath
x

నీ కొడుకు కోసం నీకు సమయం లేదా? పూరీపై బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 

Highlights

Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి త్వరలోనే "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి త్వరలోనే "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ పూరి గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పూరి జగన్నాథ్ ని అన్నయ్య అని పూరి జగన్నాథ్ భార్య లావణ్య ని వదిన అని పిలుస్తూ వారి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "ఇద్దరమ్మాయిలతో", "టెంపర్" వంటి సినిమాలలో నటించారు. తాజాగా ఆకాష్ నటిస్తున్న "చోర్ బజార్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బండ్ల పూరి పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

"ఎంతోమంది నార్మల్ స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా చేశావు కానీ నీ సొంత కొడుకు సమయం వచ్చేసరికి నువ్వు కనిపించడం లేదు. నీ కొడుకు సినిమా ఈవెంట్ కోసం స్పెషల్ గా ఫ్లైట్ ఎక్కి రాకుండా ముంబైలో ఏం చేస్తున్నావు?" అని బండ్ల గణేష్ ప్రశ్నించటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక పూరి భార్య లావణ్య రామాయణంలో సీత లాగా ఒక ఆదర్శవంతమైన భార్య, చెల్లెలు, మరియు కోడలు అని చెప్పిన బండ్ల "మా వదిన భారతమాత కంటే పవిత్రమైనది మరియు గొప్పది" అని చెప్పుకొచ్చారు. "నాలాంటి వాడిని ఒక స్టార్ నిర్మాత గా మార్చావు కానీ నీ కొడుకుని మాత్రం స్టార్ గా మార్చ లేక పోతున్నావు. ఏదేమైనా ఆకాష్ నువ్వు మాత్రం సూపర్ స్టార్ అవుతావు. అన్నా నీ కొడుకు డేట్ల కోసం నువ్వు లైన్ లో నిల్చునే రోజు కూడా వస్తుంది. అప్పుడు నీకు డేట్లు ఇవ్వద్దని ఆకాష్ తో చెప్తాను" అని పంచ్ వేశాడు బండ్ల.

Show Full Article
Print Article
Next Story
More Stories