పాపం పూరి భార్య ఏడ్చేసింది..

Bandla Ganesh Great Words About Puri Jagannath Wife Lavanya
x

పాపం పూరి భార్య ఏడ్చేసింది..

Highlights

Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి త్వరలోనే "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి త్వరలోనే "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈమధ్యనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా అతిథిగా హాజయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ బండ్ల చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఎంతోమంది నార్మల్ స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా చేసిన పూరి సొంత కొడుకు సినిమా ఈవెంట్ కోసం రాలేదేంటి అని నిలదీశారు బండ్ల. ఇక పూరి భార్య లావణ్య గురించి కూడా చెప్పుకొచ్చారు బండ్ల. "మా వదిన ఫోన్ చేసి ఇలా సినిమా ఫంక్షన్ కు రావాలని కోరింది. వదిన అంటే నాకు ఎంతో ఇష్టం. స్త్రీ జాతి గర్వపడాల్సిన తల్లిగా ఎలా ఉండాలి అంటే నేను లావణ్య గారిలా ఉండాలని చెప్తాను. ఒక అమ్మగా, అక్కగా, భార్యగా, కోడలిగా, కూతురిలా ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఆవిడకి ఉంది. కర్ణుడికి జన్మనిచ్చిన కుంతీదేవిలో ఉన్నన్ని గొప్ప క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి" అని అన్నారు బండ్ల.

"ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి కానీ అమ్మ కలకాలం ఉంటుంది. జీవితాంతం ఆమెను గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత ఆకాష్, పవిత్ర, పూరీ లకు ఉంది. మనస్ఫూర్తిగా ఆమెకు నా పాదాభివందనాలు చేస్తున్నాను. లవ్ యూ వదిన. నువ్వు నా బంగారు తల్లివి" అని చెప్పారు బండ్ల. ఈ వ్యాఖ్యలకు లావణ్య కూడా కంటతడి పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories