హీరో విజయ్ దేవరకొండ కు బండ్ల గణేష్ దిమ్మతిరిగే కౌంటర్..?

Bandla Ganesh Counter to  Vijay Devarakonda
x

హీరో విజయ్ దేవరకొండ కు బండ్ల గణేష్ దిమ్మతిరిగే కౌంటర్..?

Highlights

Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన బండ్ల గణేష్..

Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన బండ్ల గణేష్ నిర్మాతగా మారి 'గబ్బర్ సింగ్' చిత్రంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. అనతరం రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సోషల్ మీడియాలో కూడా సంచలనాలు సృష్టించారు. తన మనసుకు ఏది అనిపిస్తుందో అది ముఖం మీదనే చెప్పేస్తాడు బండ్ల . తాజాగా బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

హీరో విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నెపోటిజం పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. "మీకు మా అయ్య తెలవదు.. మా తాత తెలవదు.. ఎవ్వడు తెలవదు..రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా" అంటూ మాస్ స్పీచ్ ఇచ్చాడు విజయ్ .

తాజాగా ఈ వివాదంపైనే బండ్ల గణేష్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది . "తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్" అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ఖచ్చితంగా రౌడీ హీరోకే కౌంటర్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories