Bandla Ganesh: ముగిసిన బండ్ల గణేష్ 'సంకల్ప యాత్ర': 500 కిలోమీటర్ల పాదయాత్రతో తిరుమలలో మొక్కు తీర్చుకున్న నటుడు!

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరుమలలో తన మొక్కును తీర్చుకున్నారు.

Arun Chilukuri
Published on: 10 Feb 2026 11:36 AM IST
Bandla Ganesh: ముగిసిన బండ్ల గణేష్ సంకల్ప యాత్ర: 500 కిలోమీటర్ల పాదయాత్రతో తిరుమలలో మొక్కు తీర్చుకున్న నటుడు!
X

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరుమలలో తన మొక్కును తీర్చుకున్నారు. గత ప్రభుత్వంలో అరెస్టైన సీఎం చంద్రబాబు క్షేమంగా విడుదలవ్వాలని కోరుకుంటూ ఆయన చేపట్టిన సంకల్ప యాత్ర ఈరోజు తిరుపతికి చేరుకుంది. జనవరి 19న హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ యాత్ర.. దాదాపు 500 కిలోమీటర్లకు పైగా సాగి ఈ ఉదయం అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి, బండ్ల గణేష్ కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు.

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ యాత్రలో పాల్గొని బండ్ల గణేష్‌కు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారిని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరడమే కాకుండా, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో.. తన భక్తిని చాటుకుంటూ ఈ సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశారు. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్‌ను టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story