Ilayaraja's Emotional Video On SPB : బాలు త్వరగా లేచిరా... ఇళయరాజా ఎమోషనల్ పోస్ట్!

Ilayarajas Emotional Video On SPB : బాలు త్వరగా లేచిరా... ఇళయరాజా ఎమోషనల్ పోస్ట్!
x
Ilaiyaraaja, SPB (File Photo)
Highlights

Ilayaraja's Emotional Video On SPB : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం

Ilayaraja's Emotional Video On SPB : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అయన ఆరోగ్యం విషమంగా ఉందని, ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. అయితే ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తున్నారని ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అయన అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని దేవుళ్ళను ప్రార్థనలు చేస్తున్నారు... అందులో భాగంగానే ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు.. ఇందులో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలు నువ్వు త్వరగా లేచిరావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.. మన ప్రయాణం. సినిమాతో ప్రారంభం కాలేదు. అలాగే సినిమాతో ముగిసిపోయేది కాదు.. సంగీత స్వరాలు ఎలా అయితే విడిపోవో అలా మనం కూడా ఎప్పటికి విడిపోము.. మన మధ్య గొడవ ఉన్నా అది స్నేహమే.. లేకపోయినా స్నేహమే.. ఈ విషయం మన ఇద్దరికీ బాగా తెలుసు.. నువ్వు త్వరగా కోలుకుంటావ్ అని నా మనసు చెబుతుంది" అని ఇళయరాజా వీడియోని షేర్ చేశారు..



ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.. "అన్నయ్య బాలుగారు, మీరు త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్థనలు చేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.. అటు అభిమానులు కూడా బాలు త్వరగా కోలుకోవాలని మళ్ళీ పాటలు పాడాలని కోరుకుంటున్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories