'లక్ష్మిస్ ఎన్టీఆర్' పై బాలయ్య రియాక్షన్

Balakrishna
x
Balakrishna
Highlights

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో, లెజెండరీ యాక్టర్ మరియు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ త్వరలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో, లెజెండరీ యాక్టర్ మరియు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ త్వరలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే తను చేసే ప్రతి తో కాంట్రవర్సీ క్రియేట్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే పలు పోస్టర్లు, వెన్నుపోటు లాంటి వివాదాస్పద పాటలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై బాగానే హైప్ క్రియేట్ చేశాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నందమూరి బాలకృష్ణ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన బాలయ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై రియాక్ట్ అయ్యారు. "మా నాన్న గారి బయోపిక్ తీసే ముందు రామ్ గోపాల్ వర్మ నా అనుమతి తీసుకోలేదు. కానీ నేను మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ కోసం మా కుటుంబ సభ్యులందరి దగ్గర అనుమతి తీసుకున్నాను. వర్మ ఏ కోణం నుండి నాన్న గారి బయోపిక్ చూపిస్తాడో నాకు తెలియదు. అయినా అది తన ఇష్టం. నా రియాక్షన్ కంటే ప్రేక్షకులు ఎలా రెస్పాన్స్ ఇస్తారు అన్నది మాత్రమే ముఖ్యం" అని తేల్చి చెప్పారు బాలకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories