Multi Starrer: బాలయ్య, రజనీ, శివరాజ్ మల్టీ స్టారర్

Multi Starer: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్..ఈ ముగ్గురు కలిసి ఓ భారీ మల్టి స్టారర్ సినిమా చేయనున్నారు.

Jyothi
Updated on: 22 May 2023 8:30 PM IST
Balayya, Rajini and Shiva Rajkumar Multi Starrer Movie
X

Multi Starrer: బాలయ్య, రజనీ, శివరాజ్ మల్టీ స్టారర్

Multi Starrer: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్..ఈ ముగ్గురు కలిసి ఓ భారీ మల్టి స్టారర్ సినిమా చేయనున్నారు. KGF తరహాలో ఉండే ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కించనున్నారు.

టాలీవుడ్ లో మల్టి స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు మల్టి స్టారర్ చిత్రాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించిన మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కథ బాగుంటే కలిసి నటించేందుకు సై అంటున్నారు. మల్టి స్టారర్ చిత్రాలు గతంలో బాలీవుడ్ కే పరిమితం కాగా RRR మూవీతో ఈ ఫార్ములా చిత్రాలు దక్షిణాదిన జోరందుకున్నాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2 వంటి మల్టి స్టారర్ చిత్రాలు RRR కంటే ముందే టాలీవుడ్ ను పలకరించినప్పటికీ..ఇప్పుడు మరింత పెరిగింది. చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటించారు. బీమ్లా నాయక్ లో పవన్, రానా కలిసి నటించారు. పవన్ తదుపరి చిత్రం బ్రో చిత్రం కూడా మల్టి స్టారరే..ఇక, రీసెంట్ గా వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య లో మాస్ రాజా రవితేజా నటించి సినిమా విజయం స్థాయిని పెంచారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K లో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. సలార్ లో సైతం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ క్రాస్ ఓవర్ స్టార్ సినిమాల ట్రెండ్ ని టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ మరో ఎత్తుకు తీసుకెళ్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో కలిసి బాలకృష్ణ మల్టి స్టారర్ సినిమా చేసేందుకు రెడీ ఔతున్నారు. ఈ మూవీని కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

బాలయ్య, రజనీ, శివరాజ్ కుమార్ కలిసి నటించే మల్టి స్టారర్ చిత్రం KGF తరహాలో ఉంటుందట. అంతేకాదు దీన్ని రెండు భాగాలుగా తీస్తారని చెప్పుకుంటున్నారు. తొలి భాగం బాలయ్య, రజనీలపై ఉంటే రెండవ భాగంలో బాలకృష్ణ, శివరాజ్ కుమార్ నటిస్తారట. ఇక పోతే ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేస్తారట. ప్రస్తుతానికి బాలయ్య, రజనీ తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మల్టిస్టారర్ మూవీ సెట్స్ పైకి రానుందట. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన శివరాజ్ కుమార్..బాలయ్యతో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో బాలయ్య, రజనీ, శివరాజ్ కుమార్ కాంబోలో మల్టి స్టారర్ ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

Jyothi

Jyothi

Next Story