Nandamuri Balakrishna: నర్సులపై చేసిన కామెంట్లతో మరొసారి వివాదం లో ఇరుక్కున్న బాలయ్య

* మరొకసారి పెద్ద వివాదంలో ఇరుక్కున్న బాలకృష్ణ

Dhatripriya
Updated on: 6 Feb 2023 10:33 AM IST
Balayya Comments On Nurses
X

Nandamuri Balakrishna: నర్సులపై చేసిన కామెంట్లతో మరొసారి వివాదం లో ఇరుక్కున్న బాలయ్య

Nandamuri Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య వరుస విజయాలతో అందరి దృష్టి నీ బాగానే ఆకర్షిస్తున్నారు. అఖండ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ మధ్యనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన "వీరసింహారెడ్డి" సినిమాతో కూడా మరొక మంచి విజయాన్ని తన అకౌంట్లో వేసుకున్నారు. అయితే ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన మాటలతో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు.

ఈ మధ్యనే దేవ బ్రాహ్మణుల గురించి చేసిన కామెంట్లతో వారి మనోభావాలను దెబ్బతీసిన బాలకృష్ణ ఆ తరువాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ పై కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ పెద్ద వివాదంలో ఇరుక్కున్న తర్వాత వారికి కూడా క్షమాపణలు చెప్పారు. తాజాగా ఇప్పుడు మరొకసారి తన వైఖరితో బాలకృష్ణ వివాదంలో ఇరుక్కున్నారు.

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్" సెలబ్రిటీ టాక్ షో కి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్లో మాట్లాడుతూ గతంలో తనకు జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి చెప్పారు బాలయ్య. ఆక్సిడెంట్ గురించి వివరిస్తూ "ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉందిలే" అంటూ కామెంట్లు చేశారు ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరం కారంగా ఉన్నాయి అంటూ ఇప్పుడు ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నారు. బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకొని నర్సులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story