Nandamuri Balakrishna: ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న బాలకృష్ణ చిన్న కూతురు..

Nandamuri Balakrishna: ఈమధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 16 Oct 2022 3:46 PM IST
Balakrishnas Daughter Tejaswini plans to Start the Production House
X

Nandamuri Balakrishna: ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న బాలకృష్ణ చిన్న కూతురు

Nandamuri Balakrishna: ఈమధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బాక్స్ ఆఫీస్ వద్ద "అఖండ" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకు వెళుతున్న బాలకృష్ణ ఆహా ప్లాట్ ఫామ్ లో అన్‌స్టాపబుల్ టాక్ షో తో బుల్లి తెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే బాలయ్య సక్సెస్ వెనుక తన కూతురు తేజస్విని ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి ఒప్పుకోవడానికి కారణం తేజస్విని అట. ఇప్పటికీ కూడా షోలో బాలకృష్ణ వేసుకునే బట్టలు మరియు మిగతా విషయాలలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిసార్లు బాలకృష్ణ సినిమాల విషయంలో కూడా తేజస్విని నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ గా కాకుండా తేజస్విని తనకంటూ ఒక సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణ సినిమా తోనే తేజస్విని నిర్మాతగా మారబోతోంది. ఇప్పటికే చిరంజీవి కుటుంబం నుంచి సుష్మిత, నిహారిక, ఘట్టమనేని కుటుంబం నుంచి మంజుల, మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తేజస్విని కూడా అదే బాటలో నడవనుందని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story