logo
సినిమా

Unstoppable Talk Show: "అన్స్టాపబుల్" తో పెరిగిన బాలయ్య ఇమేజ్

Balakrishna
X

టాక్ షో తో తనమీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తున్న బాలయ్య (ఫైల్ ఫోటో)

Highlights

Unstoppable Talk Show: టాక్ షో తో తనమీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తున్న బాలయ్య

Unstoppable Talk Show: ఒకవైపు వెండితెరమీద "అఖండ" వంటి సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరోవైపు ఆహా ఓటీటీలో తన "అన్స్టాపబుల్" షో తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిజానికి ఈ షో మొదలు కాకముందు వరకు దీని గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అల్లుఅరవింద్ ఆహా లో బాలయ్య షో చేయటం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. కానీ ఈ షో ఆహా వీడియో వారికి చాలా బాగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే. చాలా సబ్స్క్రిప్షన్లు ఈ షో వల్లే పెరిగాయి. మరోవైపు ఈ షో వల్ల బాలకృష్ణ క్రేజ్ కూడా పెరిగింది.

ఆర్థిక రూపంలో మాత్రమే కాక ఇమేజ్ పరంగా కూడా బాలయ్యకి ఈ షో వల్ల ఎంతో లాభం చేకూరుతుంది. బాలకృష్ణ మాట్లాడడానికి తడబడుతూ ఉంటారు అని అనుకునే వారి అభిప్రాయం ఈ షో వల్ల మారిపోయింది. చాలా కూల్ గా ఎటువంటి తడబాటు లేకుండా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రి ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అనే విషయంలో బాలకృష్ణ తన మనసులో మాటలను ఈ షో ద్వారా నే చెప్పగలిగారు. ఇక బాలయ్య సేవా తత్వం కూడా ఈ షోలో బాగా హైలైట్ అవుతుంది. బాలకృష్ణ ఇమేజ్ కూడా ఈ షో వల్ల చాలా బాగా పెరిగిందని చెప్పవచ్చు.

Web TitleBalakrishna's Craze Increased Due to the Unstoppable Show in Aha OTT Platform | Unstoppable Show Telugu
Next Story