Balakrishna New Movie: మల్టీస్టారర్ సినిమా కి సై అంటున్న సీనియర్ హీరో

Balakrishna New Movie: మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమంటున్న బాలకృష్ణ

admin1
Updated on: 17 Dec 2021 1:15 PM IST
Balakrishna Will Act in Multi Starer Movie if the Story is Good | Balakrishna New Movie
X

మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమంటున్న బాలకృష్ణ (ఫైల్ ఫోటో) 

Balakrishna New Movie: నందమూరి బాలకృష్ణ ఈమధ్యనే "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, చిత్ర డైరెక్టర్ బోయపాటి శ్రీను మరియు సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి కలిసి విజయవాడ అమ్మవారి గుడికి దర్శనార్థం వెళ్లారు. సినిమా విజయవంతం అవడంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చామని బాలకృష్ణ తెలిపారు.

"ఈ సినిమా విడుదల చేసే ముందు నన్ను చాలా మంది హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గడంతో సినిమా విడుదల చేయటం మంచిది కాదేమో అని చాలామంది చెప్పారు. కానీ మేము సినిమాని విడుదల చేసి ఒక రిస్క్ తీసుకున్నాము. కానీ మా అంచనాలు రైట్ అయినందుకు సంతోషంగా ఉంది," అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ఇక మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ బాలకృష్ణ కథ బాగుంటే మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు.

admin1

admin1

Next Story