అప్పుడు పవన్.. ఇప్పుడు బాలయ్య.. అలాంటి పాత్రలో..

Balakrishna: మైతలాజికల్ సినిమాలలో దేవుడి పాత్రలో ఇప్పటికే చాలా మంది హీరోలు కనిపించారు.

Arun Chilukuri
Published on: 8 March 2022 7:53 PM IST
Balakrishna Will Act as God in a Social Drama Movie
X

అప్పుడు పవన్.. ఇప్పుడు బాలయ్య.. అలాంటి పాత్రలో..

Balakrishna: మైతలాజికల్ సినిమాలలో దేవుడి పాత్రలో ఇప్పటికే చాలా మంది హీరోలు కనిపించారు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ఇలా కొందరు నటులు దేవుడి పాత్రలలో కనిపించారు. కానీ సోషల్ సినిమాలలో దేవుడి పాత్రలో కనిపించిన హీరోలు తక్కువే. "గోపాల గోపాల" సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించగా "కృష్ణార్జున" సినిమా లో నాగార్జున కూడా దేవుడిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు దేవుడు పాత్రలో ఒక సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ కూడా దేవుడిగా మారబోతున్నారట.

తాజాగా ఇప్పుడు దేవుడి పాత్ర కోసం బాలకృష్ణ ని సంప్రదించారట. మరోవైపు ఈ సినిమాని నాగార్జునకి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలలో ఎవరు ఈ పాత్రకి ఓకే చెప్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా ఇలాంటి సోషల్ సినిమాలలో బాలయ్య దేవుడిగా కనిపించలేదు కాబట్టి బాలయ్య అయితే బావుంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ మధ్యనే "అఖండ" సినిమాలో అఘోర పాత్రలో మహా శివుడి ప్రతిరూపంగా కనిపించిన బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమాలో కూడా దేవుడిగా కనిపించనున్నారా లేదో ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story