Balakrishna: బాలయ్య కి గాయమైనా షూటింగ్ మాత్రం ఆపనివ్వలేదట...

Balakrishna: గాయంతోనే షూటింగ్ చేసిన బాలకృష్ణ

admin1
Published on: 7 Dec 2021 1:08 PM IST
Balakrishna was Filmed with an Injury
X

గాయంతోనే షూటింగ్ చేసిన బాలకృష్ణ (ఫైల్-ఫోటో)

Balakrishna: నందమూరి బాలకృష్ణ తన నటన తో మాత్రమే కాక తన మంచితనం తో కూడా చాలా మంది అభిమానులను ఏర్పరుచుకున్నారు. పైకి గంభీరంగా కనిపించే బాలయ్య లోపల మాత్రం అంతే సున్నిత మనస్కులు అని ఇప్పటికే చాలా మంది చెప్పారు. ఒక సినిమా కోసం ఒప్పుకుంటే బాలయ్య తన ప్రాణం పెట్టి పనిచేస్తారు.

అయితే షూటింగ్ గాయాలు అయినా కూడా షూటింగ్ మాత్రం ఎప్పుడు ఆపనిచ్చేవారు కాదట. "అఖండ" సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. దీని గురించి సినిమాకోసం పనిచేసిన కొందరు స్టంట్ టీమ్ సభ్యులు బయటపెట్టారు.

"ఆఖరి సన్నివేశం షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారి కుడి కాలు మీద త్రిశూలం పైనుండి పడింది. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని వచ్చి మళ్ళీ షూటింగ్ చేసేసారు. అయిపోయాక చూస్తే కాలు బాగా లావుగా వాచిపోయి ఉంది. చెప్పలేదేంటి సార్ అని అడిగితే ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. ఇదేముంది చేసేద్దాం అన్నారు.

షూటింగ్ ఆపుదామా అంటే ఇంత పెద్ద సెట్ వేశారు, ఇన్ని కాల్ షీట్లు.. మళ్లీ లేట్ అయితే నిర్మాతలకి నష్టం. దీని గురించి ఆలోచించకండి అన్నారు. జై బాలయ్య అని అభిమానులు ఎందుకు ఆయనంటే ప్రాణమిస్తారో అప్పుడు అర్థమైంది" అని అన్నారు స్టంట్ టీమ్ సభ్యుడు.

admin1

admin1

Next Story