Balakrishna vs Pawan Kalyan: బాక్సాఫీస్ బ‌రిలోకి ప‌వ‌న్‌, బాల‌య్య... చాలా ఏళ్ల త‌ర్వాత ఢీ కొట్ట‌నున్న హీరోలు

Balakrishna vs Pawan Kalyan
x

Balakrishna vs Pawan Kalyan: బాక్సాఫీస్ బ‌రిలోకి ప‌వ‌న్‌, బాల‌య్య... చాలా ఏళ్ల త‌ర్వాత ఢీ కొట్ట‌నున్న హీరోలు

Highlights

Balakrishna vs Pawan Kalyan: టాలీవుడ్ మాస్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల‌కు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Balakrishna vs Pawan Kalyan: టాలీవుడ్ మాస్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల‌కు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీరిద్దరూ ఎప్పుడు సినిమా తెరపై కనిపించినా అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది. తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజున బాక్సాఫీస్‌పై తలపడేందుకు రెడీ అవుతున్నారు.

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న 'అఖండ-2' చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇదే తేదీన పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఓజీ' కూడా రిలీజ్ అవుతుందని నిర్మాత డి.వి.వి. దానయ్య అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ దసరా రెండు మాస్ హీరోల మధ్య భారీ క్లాష్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

ఇంతకు ముందు రెండు సార్లు మాత్రమే

ఇంతకుముందు బాలయ్య, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద రెండు సార్లు తలపడిన సందర్భాలు ఉన్నాయి. 2006లో ‘వీరభద్ర’ (బాలయ్య), ‘బంగారం’ (పవన్) చిత్రాలు విడిగా విడుద‌ల‌య్యాయి. అయితే అదే స‌మ‌యంలో పోకిరి విడుద‌ల‌వ్వ‌డంతో ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి.

కాగా 2018లో ‘అజ్ఞాతవాసి’ (పవన్) జనవరి 10న, ‘జై సింహా’ (బాలయ్య) జనవరి 12న విడుదలయ్యాయి. పవన్ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అయితే ‘జై సింహా’మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇలా చాలా ఏళ్ల త‌ర్వాత ఇద్ద‌రు బ‌డా స్టార్ హీరోలు పోటీ ప‌డుతుండ‌డంతో ఇటు సినీ అభిమానుల‌తో పాటు, రాజ‌కీయాల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా కూడా హీట్ పెంచే అవ‌కాశం ఉందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories