Unstoppable Promo: పులిహోర కబుర్లు వద్దంటూ నానికి బాలయ్య కౌంటర్

* తాజాగా "అన్ స్టాపబుల్" రెండో ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరైన న్యాచురల్ స్టార్ నానితో బాలయ్య ప్రోమో విడుదలైంది.

Sandeep Reddy
Published on: 9 Nov 2021 5:42 PM IST
Balakrishna Unstoppable Talk Show With Nani Promo Released in Aha OTT Platform
X

నందమూరి బాలకృష్ణ "అన్ స్టాపబుల్" టాక్ షో

Unstoppable Nani Promo: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా నటసింహం నందమూరి బాలకృష్ణ "అన్ స్టాపబుల్" టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా విచ్చేసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసి టాక్ షోలలోనే టాప్ షోగా నిలిచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు బాలయ్య. తాజాగా తన రెండో ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరైన న్యాచురల్ స్టార్ నానితో జరిపిన ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. "మీ నుంచే వచ్చాడు.. మీలోనే ఉన్నాడు" అంటూ నానిని షోకి బాలకృష్ణ ఆహ్వానించాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన నానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల గురించి మాట్లాడుతూ అభిమానులకు కూడా తెలియని విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక సరదా డైలాగ్స్ తో పాటు చిన్నచిన్న గేమ్స్ ఆడుతూ బాలయ్యతో పాటు నాని ప్రేక్షకులను నవ్వించబోతున్నట్లు ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది. ఇక నాని చెప్పిన ఒక మాటకి పులిహోర కబుర్లు వద్దు అంటూ కౌంటర్ ఇచ్చి తన స్టైల్ లో అందరిని నవ్వించాడు. నా సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన నేనే బాధ్యుడిని అనుకుంటేనే "అన్ స్టాపబుల్" ముందుకు వెళ్తామని నాని చెప్పాడు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 12న "ఆహా" ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story