Unstoppable: వాయిదా పడిన బాలకృష్ణ "అన్స్టాపబుల్"

Unstoppable: బాలయ్య టాక్ షో కి పడ్డ బ్రేకులు

admin1
Updated on: 19 Nov 2021 10:00 PM IST
Balakrishna Unstoppable Tak Show was Postponed
X
వాయిదా పడ్డ బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో (ఫైల్ ఇమేజ్)

Unstoppable: ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా తన సత్తా చాటిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో కూడా తన చోటును ఏర్పరుచుకున్నారు. "అన్స్టాపబుల్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. ఆహా వీడియో లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి రెండు ఎపిసోడ్ లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ కి మంచు కుటుంబసభ్యులు గెస్ట్ లుగా విచ్చేయగా, రెండవ ఎపిసోడ్ లో నాని మన ముందుకు వచ్చారు.

అయితే ఈ టాక్స్ యొక్క మూడవ ఎపిసోడ్ ఈ వారం విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఎపిసోడ్ వాయిదా వేసినట్లు సమాచారం. మళ్ళీ ఈ షో ఎప్పటినుండి మొడలవనుంది, నెక్స్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఏ సెలబ్రిటీ రాబోతున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. "ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్" అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ షోకి మంచి ఆదరణ లభించింది. ఇక సినిమాల పరంగా బాలకృష్ణ త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

admin1

admin1

Next Story