Nandamuri Balakrishna: తనని డిస్టర్బ్ చేయొద్దని అనిల్ రావిపూడికి చెప్పిన బాలకృష్ణ

* అప్పటిదాకా ఎదురు చూడమని చెబుతున్న బాలకృష్ణ

Dhatripriya
Published on: 14 Feb 2023 10:18 AM IST
Balakrishna Told Anil Ravipudi Not To Disturb Him
X

తనని డిస్టర్బ్ చేయొద్దని అనిల్ రావిపూడి కి చెప్పిన బాలకృష్ణ 

Nandamuri BalaKrishna: ప్రముఖ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కు తన సినిమాల మధ్యలో ఎక్కువ గ్యాప్ రావటం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒక సినిమా విడుదల అయ్యే సమయానికి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలైపోయి ఒక షెడ్యూల్ కూడా పూర్తయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా సినిమాకి మధ్యలో బాలకృష్ణ తీసుకునే గ్యాప్ చాలా చాలా తక్కువనే చెప్పాలి.

ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా "వీరసింహారెడ్డి" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలకృష్ణ తాజాగా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా రెండవ షూటింగ్ షెడ్యూల్ ను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఫ్లాప్ లెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఫిబ్రవరి మొదటి వారం నుంచే షూటింగ్ మొదలవ్వాల్సింది కానీ బాలకృష్ణ డేట్లు కుదరకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది.

అయితే తాజాగా అనిల్ రావిపూడి మరియు నిర్మాతలు కలిసి షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి అని బాలకృష్ణ ను అడగగా బాలయ్య ఫిబ్రవరి ఆఖరి దాకా ఎదురు చూడమని చెప్పారట. ఈలోపు తనని డిస్టర్బ్ చేయొద్దని బాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. రెండు సినిమాలకి మధ్య గ్యాప్ ఇష్టం ఉండని బాలకృష్ణ తన డైరెక్టర్ ను ఎదురు చూడమని చెప్పడానికి కారణం లేకపోలేదట. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి వలనే నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కూడా ఆ బాధలో ఉన్నట్లు అందుకే షూటింగ్ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story