'ఎఫ్ 2' దర్శకుడితో నందమూరి బాలకృష్ణ

ఎఫ్ 2 దర్శకుడితో నందమూరి బాలకృష్ణ
x
Highlights

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా మా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఆ సినిమా అనుకున్నంత...

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా మా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని సాధించలేక పోయింది. అందుకే ఈ చిత్రంలో రెండో భాగం అయిన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాను ఏ మాత్రం బజ్ లేకుండా విడుదల చేశారు. అనుకున్న విధంగానే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది. ఇక ఈ సినిమా తరువాత ఎన్నికలతో బిజీ అయిన బాలకృష్ణ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేయాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కాని బాలకృష్ణ కోసం మరొక డైరెక్టర్ కథ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం దర్శకుడు వినాయక్ తో కలిసి బాలకృష్ణ కోసం ఒక కథను ప్రిపేర్ చేస్తున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తల పై రియాక్ట్ అయ్యాడు అనిల్ రావిపూడి. వినాయక్ తో స్క్రిప్ట్ పూర్తి చేయాల్సిన మాట నిజమే కానీ దానికంటే ముందు కొన్ని కమిట్ మెంట్ లతో బిజీగా ఉన్నానని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories