HBD Balakrishna: ఎవరిష్టం వారిది.. ఎన్టీఆర్ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య!

HBD Balakrishna: రాజకీయాల్లోకి రావడమనేది ఎవరి ఇష్టం వారిదని బాలయ్య బాబు అన్నారు.

Venkata Chari
Updated on: 10 Jun 2021 10:45 PM IST
Balakrishna Talks Jr NTR Political Entry
X

ఎన్టీఆర్, బాలయ్య బాబు (ఫొటో ట్విట్టర్)

HBD Balakrishna: రాజకీయాల్లోకి రావడమనేది ఎవరి ఇష్టం వారిదని బాలయ్య బాబు అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై అడిగిన ఓ ప్రశ్నకు బాలయ్య బాబు పై విధంగా సమధానమిచ్చారు. చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు బాలయ్య స్పందించారు. ఎవరిష్టాలు వారివని, వాళ్ల ఆలోచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

అయితే, ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించడంలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలోంచి పుట్టిందని అన్నారు. ఇందులో క్లీన్‌ గా ఉండే వాళ్లకే పేరు, గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అనే ప్రశ్నకు బాలయ్య చిరునువ్వుతో దాటవేశారు. "ప్లస్ అయి మైనస్ అయితే!" అంటూ సమాధానం ఇచ్చారు.

Venkata Chari

Venkata Chari

Next Story