NTR: సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకత: బాలకృష్ణ

NTR: ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు సముచిత స్థానం

Jyothi
Published on: 21 May 2023 7:01 AM IST
Balakrishna Speech at NTR Centenary Celebrations in Hyderabad
X

NTR: సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకత: బాలకృష్ణ

NTR: తెలుగోడి ఆత్మగౌరవానికి ఎన్టీరామారావు ప్రతీకగా నిలిచారని, దేశంలోనేకాదు... ప్రపంచదేశాల్లోనూ తెలుగు భాషకు గుర్తింపుతెచ్చిన ఘనతను పుణికి పుచ్చుకున్న పురుషోత్తముడని పలువురు కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ, రాజకీయ రంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.

ఎన్టీ రామారావు సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో అగ్రహీరోగా రాణించడమేకాదు.. రాజకీయాల్లో సంచలనాలకు కారణమై ప్రజల గుండెల్లో సముచిత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story