Mokshagna: బాలయ్య నట వారసుడి ఎంట్రీ ఖరారు.. ప్రకటన ఆ రోజేనా.?

Balakrishna son Mokshagna Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు, తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Aug 2024 7:30 PM IST
Balakrishna son Mokshagna Movie
X

Balakrishna son Mokshagna

Balakrishna son Mokshagna Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు, తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఏ సినిమా వేడుకల్లో పాల్గొన్న అభిమానుల నుంచి ఈ ప్రశ్న కామన్‌గా మారింది. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించి అటు అభిమానులతో పాటు, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. మోక్షజ్ఞ తొలి మూవీని ఎవరు తెరకెక్కించనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రటకన చేసే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. మోక్షజ్ఞను యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఇండస్ట్రీకి పరిచయడం చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హను-మాన్‌ చిత్రంతో మొత్తం దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. అందుకే ఈ డైరెక్టర్‌తో అయితే మోక్షజ్ఞకు పర్‌ఫెక్ట్ లాంచింగ్ అవుతుందని భావించిన బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలకృష్ణతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడు ప్రకటించనున్నారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా సెప్టెంబర్‌ 1వ తేదీన బాలకృష్ణ సినీ సర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. అలాగే 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు ఉంది. మరి రెండు ఈ రోజుల్లో ఏదో ఒక రోజు సినిమా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాకు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. వీటన్నింటికి సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story