Balakrishna Son Mokshagna: మైత్రీ నిర్మాణంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ?
Balakrishna Son Mokshagna: ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నట్లు టాలీవుడ్ టాక్.
Balakrishna, Mokshagna:(Twitter)
Balakrishna Son Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అవ్వండి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న జూనియర్ బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ 61వ బర్త్ డే సందర్భంగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి కూడా వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇటీవల ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం. బుచ్చిబాబుకు తన తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లోనే చేయాల్సి ఉంది. దీనికి తోడు బాలయ్య తన వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీ బాధ్యతను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌కు అప్పగించినట్లుగా కూడా సమాచారం అందుతోంది.
అందులో భాగంగా ప్రస్తుతం మోక్షజ్ఞ నటనతో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై ఫోకస్ పెట్టారట. ఇక ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.




