Balakrishna: ప్రయోగాలు చేయటం ఇష్టం అంటున్న బాలకృష్ణ

* ఎక్స్పరిమెంట్స్ చేయటం చాలా ఇష్టం అంటున్న సీనియర్ హీరో బాలకృష్ణ

admin1
Updated on: 16 Oct 2021 4:14 PM IST
Balakrishna Says i like to Experiments in Telugu Film Industry
X

బాలకృష్ణ (ట్విట్టర్ ఫోటో)

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు మరొక అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. ఇప్పటిదాకా హీరోగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా తన ప్రతిభను చాటిన బాలయ్య ఇప్పుడు హోస్ట్ గా మారి బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరించనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఒక సెలబ్రిటీ టాక్ షో ఆహా వీడియో యాప్ లో "అన్స్టాపబుల్" అనే టైటిల్ తో నవంబర్ 4 నుంచి స్ట్రీమ్ కానుంది. దీని గురించి మాట్లాడుతూ తనకు ఎక్స్పెరిమెంట్స్ చేయటం చాలా ఇష్టం అని అంటున్నారు బాలకృష్ణ.

"కొత్త కొత్త అంశాలను తెలుసుకున్నప్పుడే ఒక ఒక కళాకారుడిగా మనం ఎదగగలం. అలాంటి ఒక ఐడియా ని అల్లు అరవింద్ నా దగ్గరికి తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమా త్వరలోనే దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదల సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా ఇంకా వెలువడాల్సి ఉంది. సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల డిసెంబర్ కి వాయిదా వేసినట్లు సమాచారం. మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story